Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ ప్రవేశద్వారంగా శంషాబాద్ : హైదరాబాద్‌లో కలకలం

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:14 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అనేక రాష్ట్రాల్లో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అయితే, ఈ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులకు ప్రవేశమార్గంగా శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారింది.
 
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు పదులు దాటిపోగా, శంషాబాద్ పరిధిలో మాత్రం నాలుగు కేసులు వెలుగు చూశాయి. పెద్దషాపూర్ ఆరోగ్య పరిధిలోని ఇందిరానగర్ దొడ్డికి చెందిన ఓ కుంటుంబం ఇటీవల దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. 
 
వీరికి విమానాశ్రయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత జన్యుక్రమ పరీక్షలు చేయగా, ఒమిక్రాన్ పాజిటివ్ అని ఖరారైంది. అయితే, ఈ ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే ఆ కుటుంబాన్ని ఇంటికి పంపించారు. దీంతో ఆ బాలుడు అనేక మంది స్థానిక పిల్లలతో కలిసి తిరిగాడు. 
 
మూడు రోజుల తర్వా ఆ బాలుడికి ఒమిక్రాన్ అని తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో కాంటాక్ట్ అయిన వారిలో 40 మందిని గుర్తించి పరీక్షలు చేయడంతో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీఆర్ ఫలితాలు వచ్చేంత వరకు వేచిచూడకుండా ఆ బాలుడిని ఇంటికి పంపించడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments