Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోవిడ్ టీకా తీసుకున్న రతన్ టాటా

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (12:49 IST)
టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
కరోనా నుంచి అందరూ సురక్షితంగా ఉంటారని భావిస్తున్నట్లు రతన్ టాటా తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.82 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. నిన్న ఒక్క రోజే 20 లక్షల 53 వేల మంది కోవిడ్ టీకా వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1.09కోట్లకుపైగా చేరగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య రెండులక్షలపైగా చేరుకుంది. 
 
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments