కరోనా సెకండ్ వేవ్.. చలికాలం వచ్చేస్తోంది.. జాగ్రత్త..!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా కేసులు 80 లక్షలు దాటేశాయి. సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్‌ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అయినా ప్రజల నిర్లక్ష్యం కారణంగా వ్యవహరిస్తున్నారు.  నవంబర్‌ 30 వరకు నిబంధనలున్నా జనం సామాన్యజీవనానికి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో చలికాలం వచ్చేసింది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి.. ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ ఏడాది కరోనాతో పాటు మరెన్నో సీజనల్ రోగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. 
 
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.. అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: పెద్ది ఐటెం సాంగ్ కోసం ఇంత రచ్చ చేయాలా !

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments