అమెరికాలో విజృంభిస్తోన్న డెల్టా వైరస్..

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:01 IST)
అమెరికాను డెల్టా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. 
 
ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల రిజర్వు చేసిన ఆక్సిజన్‌ను కూడా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు పేర్కొన్నారు.
 
సాధారణంగా 90 శాతం నిండి ఉండే ఆక్సిజన్‌ ట్యాంకులో 30-40 శాతం మిగిలి ఉండే వరకు ఆక్సిజన్‌ను వాడతారు. అలా మిగల్చడం వల్ల మరో ఐదు రోజుల వరకు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ, ఇప్పుడు 10శాతం స్థాయి వరకు వాడేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. 
 
దీని వల్ల ఒకటి రెండు రోజులకు మించి ఆక్సిజన్ నిల్వలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
దీనికితోడు హరికేన్ల కారణంగా గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయ కలుగులోంది. ఇది వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. 
 
12 ఏళ్ల లోపు వారికి టీకాలు అందుబాటులో లేకపోవడంతో, త్వరలోనే స్కూళ్లు తెరవనుండడంతో వారు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారినపడే అవకాశం ఉందని, వారితో ఆస్పత్రులు నిండిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments