దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 8380 కేసులు

Webdunia
ఆదివారం, 31 మే 2020 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో మరో 8380 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో 193 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,82,143కి చేరగా, మృతుల సంఖ్య 5,164కి చేరుకుంది. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.
 
21 మంది కోలుకుంటున్నారు : లారెన్స్ 
అనాథ చిన్నారుల కోసం తాను నిర్వహిస్తున్న ట్రస్టులోని 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బంది కరోనా బారినపడిన మాట వాస్తవమేనని ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం వాళ్లంతా కోలుకుంటున్నారని చెప్పారు. 
 
చెన్నై అశోక్ నగరంలోని లారెన్స్ ట్రస్టులో వారం రోజుల క్రితం ట్రస్టులోని కొందరు చిన్నారుల్లో జ్వరంతోపాటు కోవిడ్-19 లక్షణాలు కనిపించడంతో వారికి వెంటనే పరీక్షలు చేయించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో 18 మంది చిన్నారులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు.
 
కరోనా బారినపడిన ముగ్గురు సిబ్బందిలో ఇద్దరు దివ్యాంగులు ఉన్నారని వివరించారు. వైరస్ బారినుంచి వారు త్వరగానే కోలుకుంటున్నారని, సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్న ఎస్పీ వేలుమణికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రాఘవ లారెన్స్ తెలిపారు. చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు దేవుడ్ని ప్రార్థించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments