Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా వేయించుకున్న వ్యక్తికి కరోనా సోకితే.. కుటుంబ సభ్యులను రక్షించినట్టే...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (14:44 IST)
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కోరనా వైరస్ సోకినపక్షంలో.. ఆ రోగి.. తన కుటుంబానికి చెందిన సభ్యులను కరోనా వైరస్ నుంచి 50 శాతం మేరకు రక్షించినట్టేనని ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారు నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
ప్రపంచాన్ని కుదిపేస్తున్ వ్యాక్సిన్... కరోనా వైరస్‌ నుంచి రక్షించడమేకాకుండా వ్యాప్తిని కూడా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారిన పడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.
 
ఈ మేరకు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌(పీహెచ్‌ఈ) పరిశోధకులు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై అధ్యయనం జరిపారు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల తర్వాత మహమ్మారి బారిన పడిన వారి నుంచి టీకా తీసుకోని కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశం 38-49 శాతం తగ్గినట్లు గుర్తించారు. 
 
దీంతో టీకా వైరస్‌ బారి నుంచి రక్షించడమే కాకుండా.. వ్యాప్తిని కూడా తగ్గిస్తుందన్న విషయం స్పష్టమైందని బ్రిటన్‌ హెల్త్‌ సెక్రటరీ మ్యాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్‌ ప్రాధాన్యతను ఇది తెలియజేస్తోందన్నారు.
 
ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనీసం ఒకరు కరోనా బారిన పడిన 24 వేల కుటుంబాల్లో 57 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఈ ఫలితాల్ని పది లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారి సమాచారంతో పోల్చి చూడగా.. తాజా విషయం వెలుగులోకి వచ్చింది. 
 
గతంలో జరిపిన పలు అధ్యయనాల్లో.. ఒక డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత వైరస్‌ వల్ల తలెత్తే లక్షణాలు 65 శాతం తగ్గినట్లు తేలిన విషయం తెలిసింది. ఇళ్లు, జైళ్లు, లేదా కలిసి నివాసం ఉండే ప్రదేశాల్లో వైరస్‌ సంక్రమణకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు గతంలోనే గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments