భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 25 వేల కేసులు

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (10:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ కేసుల సంఖ్య 25 వేలు దాటడం మరింతగా కలవరపెడుతోంది. 
 
గడిచిన 24 గంటల్లో 8,64,368 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,320 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,59,048కి చేరింది. క్రియాశీల కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. 
 
దేశంలో ప్రస్తుతం 2,10,544 యాక్టివ్‌ కేసులుండగా.. ఆ శాతం 1.85కి పెరిగింది. మరోవైపు నిన్న 16,637 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,09,89,897(96.75శాతం)గా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 161 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,58,607కి చేరింది.
 
మరోవైపు, మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. శనివారం ఒక్క రోజే 15,602 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. 88 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ముంబై, నాగ్‌పూర్‌లలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 50,998 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 228 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,161కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1653కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 152 మంది కోలుకున్నారు. 
 
ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,515కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,993 ఉండగా.. వీరిలో 795 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 46 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,00,465కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments