Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (13:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గత ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 3824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
దాదాపు 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళ రాష్ట్రంలో రెండు మృతి కేసులు నమోదయ్యాయి. ఈ మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి  సంఖ్య 5,30,389కి చేరింది. అలాగే, దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కి చేరింది. 
 
రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,47,22,605 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 4,41,73,335 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments