Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల‌లోనే కోవిడ్ ఉధృతి, త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:22 IST)
థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందా? రాదా? ...అలా ఏం రాదులే... అయినా దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే...అంటూ చాలామంది అశ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. త‌మ‌కేం కాదులే అనే ధీమాతో కోవిడ్ నిబంధ‌న‌లేమీ పాటించ‌కుండా, ఎంచ‌క్కా తిరిగేస్తున్నారు. కానీ, మీకో హెచ్చ‌రిక‌... కోవిడ్ 19 తిరిగి ఈ నెల‌లోనే ఉధృతంగా మార‌నుంది.
 
భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే, దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని అంచ‌నాలు వేస్తున్నారు.

గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ గ‌మ‌నించాల్సిన అంశం. మూడో ఉద్ధృతి తార స్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెప్పారు.  పరిస్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకూ చేరొచ్చని విశ్లేషిస్తున్నారు.
 
అందుకే ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త వ‌హించండి. భౌతిక దూరాన్ని పాటించండి. ఎప్ప‌టిక‌పుడు చేతుల‌కు శానిటైజ్ చేసుకోండి. చ‌క్క‌గా స‌బ్బుతో చేతులు క‌డుక్కోవ‌డం చాలా మంచిది. అలాగే, పెళ్ళిళ్ళూ, ప‌బ్బాలు అంటూ, స‌మూహాల్లోకి వెళ్ళ‌కండి. ఎందుకంటే, గాలిలో వ్యాపించే కోవిడ్ 19, ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో తేలిక‌గా మ‌న‌కు సంక్ర‌మిస్తుంది. అందుకే త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments