Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్న వారిలో ప్రాణాంతక ఇన్ఫెక్షన్!

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (13:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రపంచ ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇలాంటివారిలో లక్షలాది మంది చనిపోగా, మరికొందరు కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారికి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ సోకుతోంది. దీన్ని మ్యూకర్ మైకోసిస్‌గా గుర్తించారు. 
 
ఈ విషయాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వైద్య నిపుణులు వెల్లడించారు. దీని బారినపడిన వారిలో అత్యధికులు మధుమేహం, కేన్సర్‌, హెచ్‌ఐవీ రోగులు, అవయవమార్పిడి చేయించుకున్న వారేనని తెలిపారు. ఆరోగ్యవంతులతో పోలిస్తే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల.. వారిపై అతి సులువుగా మ్యూకర్‌ మైకోసిస్‌ దాడి చేస్తోందని చెప్పారు. 
 
ఇటీవల  తమ ఆస్పత్రిలో మ్యూకర్‌ మైకోసి్‌సతో ఐదుగురు మృతిచెందారని అహ్మదాబాద్‌ ప్రభుత్వ దంత వైద్యశాల సర్జన్‌ సోనల్‌ అంచ్‌లియా తెలిపారు.‘మ్యూకర్‌ మైకోసిస్‌’ సమస్యపై 2020 డిసెంబరులో  గుజరాత్‌ ప్రభుత్వం అడ్వైజరీ జారీచేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 
 
ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో 13 మంది ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌తో చేరగా, పలువురిలో దృష్టిలోపం తలెత్తింది. ఇంకొందరికి సర్జరీ చేసి ముక్కు, పైదవడ ఎముకలను తొలగించాల్సి వచ్చింది.  ఢిల్లీలో ఐదుగురు మృతిచెందడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments