Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్స్‌ఫర్డ్ టీకా గురించి గుడ్ న్యూస్ అందించిన సీరమ్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (14:06 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చింది. కరోనా మహమ్మారి వలన పలు దేశాలు తీవ్రమైన మరణకాండకు గురైనాయి. కరోనాను కట్టడి చేయడం కోసం పలు దేశాలు విభిన్న మార్గంలో వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి వ్యాక్సీన్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని టీకాలు తయారైనా అందరి దృష్టి మాత్రం ఆక్స్‌ఫర్డ్ టీకా పైనే ఉన్నది. ఆస్ట్రాజెనికా సంస్థతో కలిసి తయారుచేసిన టీకా మంచి ఫలితాన్నిస్తుందని పలువురి నమ్మకం. ఈ టీకాను ఉపయోగించడంతో యువతతో పాటు వృద్దుల్లోనూ మెరుగైన మార్పు కనిపిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. యాంటీబాడీతో పాటు అవి క్రియేట్ చేసే టీసెల్స్ నెంబర్ కూడా భారీగా ఉందని చెప్పారు.దీంతో ఒక్కసారిగా ఆశ మొదలైంది.
 
కరోనా కష్టాలకు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడింది. భారత్ దేశంలో సీరమ్ సంస్థ కోవీ షీల్డ్ పేరుతో ఆక్స్‌ఫర్డ్ టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఇది డిసెంబరు నాటికి రెడీ అవుతుందని ఆ సంస్థ చీఫ్ ఆదార్ పూనావాలా తెలిపారు. పది కోట్ల వ్యాక్సిన్ డోస్‌లతో వచ్చే ఏడాది ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. బ్రిటన్లో మరో రెండు వారాల్లో వ్యాక్సిన్ పరీక్షలు పూర్తయి వ్యాక్సిన్ సామర్థ్యం భద్రత మెరుగ్గా ఉందని తెలిస్తే అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తాము భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తామని పూనావాలా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments