Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 15 తర్వాత కరోనా మరింత ముదురుతుంది-రిపోర్ట్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (15:59 IST)
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైన ఈ సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 15 తర్వాత మరింత ముదురుతుందని అంచనా వేసింది. మార్చి 23 వరకూ నమోదైన కేసుల ట్రెండ్‌ను బట్టి చూస్తే భారత్ లో సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య 25 లక్షలుగా ఉంటుందని తెలిపింది. 
 
తాజా రిపోర్ట్ ప్రకారం.. కరోనా సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయడానికి స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్షలు అంత ప్రభావం చూపించడం లేదని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. 28 పేజీల ఈ నివేదికలో... కరోనా కట్టడికి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడమే దీనికి ఏకైక పరిష్కరమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం రోజుకు 34 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. దీనిని కనీసం 40-45 లక్షలకు పెంచాలని చెప్పింది. 
 
అలా చేస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి 4 నెలలు పడుతుంది. ఇక,పలు రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్షల ప్రభావం వ్యాపారాలపై ఎలా ఉంటుందో వచ్చే నెలలో తెలుస్తుందని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది.
 
మరోవైపు, గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న కోవిడ్‌ కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాబోయే కొన్ని నెలలు విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతిని విస్తరించదని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. 
 
దేశీయ డిమాండ్‌ను నెరవేర్చేందుకు రానున్న కొన్నినెలలు ఎగుమతులను విస్తరించబోమని అధికారులు పేర్కొన్నారు. జనవరి 20 నుంచి ఇండియా విదేశాలకు టీకా డోసులను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 80 దేశాలకు 60.4 మిలియన్‌ మోతాదుల కొవిడ్‌ వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments