Webdunia - Bharat's app for daily news and videos

Install App

20K మార్క్‌ను దాటిన కరోనా కేసులు - గుజరాత్‌లో ఒక్కసారిగా పెరిగిన కేసులు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (11:22 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. అదుపులో ఉన్నట్టే కనిపించి ఈ వైరస్ గత వారం రోజులుగా విజృంభిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఫలితంగా గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1383 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,984కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 640 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  
 
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3869 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 15,474 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 5,218కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 251 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 2,178 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,156కి చేరింది.
 
గుజరాత్‌లో ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 1,500పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు 20,000కు చేరువలో ఉన్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments