Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు - అక్టోబరులో థర్డ్ వేవ్ : వైరాలజిస్టుల హెచ్చరిక

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (14:05 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం చాలా మేరకు తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య కూడా 50 వేలకు దిగువకు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 42,640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మూడు నెలల తర్వాత నమోదైన అతి తక్కువ కేసులు కావడం గమనార్హం. 
 
వీరిలో 1,167 మంది కరోనా బారినపడి మరణించగా…81,839 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కేసులు తగ్గుతుండటం ఊరట కలిగిస్తున్నా.. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయడం, ఆంక్షలు సడలించడంతో థర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్నాయి. ఊహించిన దానికంటే ముందే థర్డ్ వేవ్ రావచ్చని ఇప్పటికే కొన్ని సర్వేల నివేదికలు హెచ్చరించాయి. 
 
థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. తాజాగా ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం నిర్వహించిన అధ్యయనంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఐఐటీ కాన్పూర్ అధ్యయనం మేరకు దేశంలో థర్డ్ వేవ్ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో ఉధృతంగా ఉండే అవకాశముందని పేర్కొంది. 
 
ప్రొఫసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మ నేతృత్వంలోని బృందం ఈ సర్వే నిర్వహించింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్ వేవ్ ఎప్పుడు రాబోతుందన్న దానిపై అంచనావేశారు. జులై 15నాటికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేసే అవకాశముందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments