Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 22,775 కేసులు నమోదు

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (11:46 IST)
దేశంలో తాజాగా 22,775 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో క్రియాశీల కేసుల సంఖ్య 1 లక్ష దాటింది.
భారత్‌లో 24 గంటల వ్యవధిలో రోజువారీ కోవిడ్‌ కేసులు 22,775కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
 
 
అదే సమయంలో 406 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,81,486కు చేరుకుంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.30 శాతం ఉన్న యాక్టివ్ కేసులు 1,04,781కి పెరిగింది.


ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 1,431కి పెరిగింది. ఈ కేసులలో 488 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను నివేదించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 
గత 24 గంటల్లో 8,949 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,42,75,312కి పెరిగింది. ఫలితంగా భారతదేశంలో రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది.
 
 
 
ఇదే కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 11,10,855 పరీక్షలు జరిగాయి. కేసులు ఆకస్మికంగా పెరుగుతుండటంతో వారపు పాజిటివిటీ రేటు 1.10 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 58,11,587 వ్యాక్సిన్ డోస్‌లు వేయడంతో శనివారం ఉదయం నాటికి దేశంలో కోవిడ్ టీకాలు 145.16 కోట్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments