భారత్‌లో కరోనా తగ్గుముఖం,కొత్తగా 49,881 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (13:46 IST)
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా కాస్త వెనుకంజ వేస్తోంది. గత కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో వున్న కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 80 లక్షల 40 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 49,881 కేసులు నమోదు కాగా 517మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,480 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 80,40,203 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,03,687 ఉండగా 73,15,989 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 1,20,527మంది కరోనా వ్యాధితో మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.99శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.50 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 7.51 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,75,760 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు దేశంలో 10,65,63,440 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments