Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? లేదా..?

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (11:53 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా చేసిన నష్టం అంతాఇంతా కాదు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు అన్ని దేశాలు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు తుది దశకు, మూడు, రెండు దశల్లో మరికొన్ని ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందోనన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోయినా.. ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? లేదా..? అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఈ వైరస్‌ వ్యాప్తిపై ఓ ప్రకటన విడుదల చేసింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని సీడీసీ గతంలోనూ తెలిపింది. 
 
తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పెట్టి మళ్లీ తొలగించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమాచారాన్ని తొలగించినట్లు చెప్పిన సీడీసీ మరోసారి గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు ప్రజలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
 
కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్లలో వైరస్‌ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణించి వేరొకరికి సోకే అవకాశం ఉందని వెల్లడించింది. సాధారణంగా తుంపర్లు కొద్ది దూరం మాత్రమే ప్రయాణించి ఆ తర్వాత పేలిపోయి, వైరస్‌ నేలపై పడిపోతుంది. అలాంటి సమయంలో ఆరు అడుగుల దూరం లోపల ఉన్న వారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని సీడీసీ స్పష్టం చేసింది. 
 
మరోవైపు గాలి, వెలుతురు సక్రమంగా లేని ప్రాంతాల్లో తుంపర్ల ద్వారా వైరస్‌ కనీసం 2 మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని, అలాంటి సమయంలో 6 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పటికీ ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపింది. అయితే వైరస్‌ గాలిలో ఎంతసేపు బతికి ఉంటుందన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments