Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ చికిత్సలో మరో కొత్త ఔషధం... ఒక డోసు ధర రూ.59,750

Webdunia
సోమవారం, 24 మే 2021 (20:02 IST)
Antibody cocktail
కోవిడ్ చికిత్సలో మరో కొత్త ఔషధం ప్రవేశించింది. దీన్ని యాంటీబాడీ కాక్ టెయిల్ అంటారు. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కరోనా బారినపడిన డొనాల్డ్ ట్రంప్‌కు ఈ మందునే వాడారు. ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి.
 
ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికనే ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్‌ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్‌ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు పేర్కొన్నారు. 
 
దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments