Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరకొరియాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో రోగి మృతి.. కిమ్‌కు తలనొప్పి

Webdunia
శనివారం, 14 మే 2022 (09:31 IST)
Kim
ఉత్తరకొరియాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో కోవిడ్ కిమ్ సర్కారుకు పెద్ద ఛాలెంజ్‌గా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన కిమ్.. ప్రస్తుతం కరోనా వ్యాప్తితో అప్రమత్తం అయ్యారు. 
 
ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసు నిర్ధారణ తర్వాత నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్‌ జోంగ్ ఉన్‌ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
మరోవైపు.. తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైన  24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. 
 
ఇక, నార్త్‌ కొరియాలో ​కోవిడ్‌ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. 
 
అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్‌ తిరస్కరించారు. 
 
ఇప్పటికే జ్వరం తదితర లక్షణాలతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బాధపడుతున్నారు. ఆరుగురు మరణించారు. వీరంతా కరోనా వైరస్ బాధితులే అయితే అక్కడ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. 
 
ఉత్తర కొరియాలో కరోనా వైరస్ తీవ్రతపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇది ఆ దేశంపై గట్టి ప్రభావాన్నే చూపించనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే అక్కడ వైద్య సదుపాయాలు చాలా బలహీనం. 2.6 కోట్ల మంది ప్రజలకు టీకాలు వేయలేదు. 
 
జ్వరం లక్షణాలతో బాధపడుతున్న నమూనాలను పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్ అని తెలిసినట్టు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ సైతం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments