నేను దేవుడు దగ్గరకి వెళ్లిపోతా, మూడో అంతస్తు నుంచి దూకేసిన కరోనా రోగి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (19:18 IST)
కోవిడ్ ఆస్పత్రి నుంచి ఓ రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు (32) ఈ నెల 17న ఆశ్రం కోవిడ్‌ ఆసుపత్రిలో చేరాడు. గత మూడు రోజులుగా రాంబాబు 'నేను దేవుడు దగ్గరకి వెళిపోతా' అంటూ అరుస్తూ విచిత్రంగా ప్రవర్తించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో రాంబాబును చూసుకునేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. 
 
రాంబాబు ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో కుటుంబసభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 'బై బై.. నేను దేవుడి దగ్గరకు వెళ్లిపోతున్నా' అని గట్టిగా అరుస్తూ మూడో అంతస్తు కిటికీలో నుంచి కిందకు దూకాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ సీఐ అనసూరి.శ్రీనివాస్, ఎస్సై చావా సురేష్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments