Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 7 లక్షలు దాటిన కరోనా - తెలంగాణాలో కరోనా ఉగ్రరూపం

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (10:28 IST)
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. అదేసమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు.
 
తెలంగాణలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 1,831 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. అటు, ఒక్క రోజులో 11 మంది మరణించగా, కరోనా మృతుల సంఖ్య 306కి పెరిగింది. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య కంటే నేడు డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా 2,078 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 10,646 మంది చికిత్స పొందుతున్నారు. ప్రాంతాల వారీగా చూస్తే... జీహెచ్ఎంసీ పరిధిలో 1,419 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments