Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా విజృంభణ.. 63,509 పాజిటివ్ కేసులు.. 730మంది మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (10:59 IST)
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72లక్షల 39 వేలు దాటింది. గడిచిన 24 గంటలలో 63,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 730 మంది మృతి చెందారు.

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 71,760గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7239390 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 8,26,877 ఉన్నాయి.
 
ఇప్పటిదాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6301928కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 110586కి చేరింది. ఇక దేశంలో 86.36 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉంది. అలానే దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.53 శాతానికి మరణాల రేటు తగ్గింది.
 
అలాగే తెలంగాణలో కొత్తగా 1,446 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,16,238కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,241మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 23,728 యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పటివరకు 1,91,269 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 252, రంగారెడ్డి 135, మేడ్చల్‌ 131 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments