Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:08 IST)
భారత్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 79 లక్షల 90 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 43,893 కేసులు నమోదు కాగా, 508 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 58,439 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.
 
దేశంలో మొత్తం 79,90,322 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,803 ఉండగా, 72,59,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 1,20,010 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90.85 శాతంగా ఉంది.
 
దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.50 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.64 శాతంగా ఉంది. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 10,66,786 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 10,57,87,680 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments