తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 70, తెలంగాణలో 149 కేసులు

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (19:32 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 115 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,555 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. 8,80,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 917 మంది చికిత్స పొందుతున్నారు. 
 
వైరస్‌ ప్రభావంతో నేటివరకు 7,160 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఏపీలో ఇవాళ 26, 844 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,33,94,460 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
 
అలాగే గత 24 గంటల్లో తెలంగాణలో 31,834 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,415 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,612కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments