కరోనాకు నచ్చిన మార్చి.. ఈ ఏడాది కూడా అదే తంతు.. 32 మంది ఆటోవాలాలకు పాజిటివ్

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (09:21 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గతేడాది మార్చిలోనే కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది కూడా మార్చి నెలలోనే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో సూపర్ స్పైడర్ కేసులు బయటపడ్డాయి. 
 
ఆటోవాలాలకు కరోనా టెస్టులు నిర్వహించగా ఒకేసారి 32 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ జరిగింది. దీంతో సూరత్ మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆటోడ్రైవర్ల కాంటాక్ట్ లిస్ట్ ను ట్రేస్ చేసే పనిలో పడిపోయారు. 
 
ఆటోడ్రైవర్లు, దుకాణదారులు, కూరగాయల వ్యాపారాలు చేసుకునేవారికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. దేశంలో సెకండ్ వేవ్ సమయంలో సూరత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
అలాగే ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33వేల 634 శాంపిల్స్‌ను పరీక్షించగా 492 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజే 168 కేసులు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జిల్లాలో 63 మందికి వైరస్‌ సోకగా.. చిత్తూరులో 56, గుంటూరులో 47, విశాఖపట్నంలో 46 అనంతపురంలో 29 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8లక్షల 94వేల 536కి పెరిగింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments