ఆంధ్రాలో కరోనా దూకుడు : కొత్తగా 704 పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (13:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా మంగళవారం కూడా కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,202 అని పేర్కొంది. 
 
ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 187కి చేరింది.
 
జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే, అనంతపురం 1571, చిత్తూరు 1054, ఈస్ట్ గోదావరి 1129, గుంటూరు 1349, కడప 940, కృష్ణ 1467, కర్నూలు 1955, నెల్లూరు 608, ప్రకాశం 370, శ్రీకాకుళం 63, విశాఖపట్టణం 542, విజయనగరం 159, వెస్ట్ గోదావరి 995 చొప్పున కేసులు నమోదైవున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh Manyavar: ఇన్‌స్టాలో అత్యధిక లైక్స్‌తో గ్లోబల్ రికార్డ్ విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments