కొత్త వేరియంట్ బి.1.1.529కు "ఒమిక్రాన్‌"గా నామకరణం

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (10:44 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ బి.1.1.529గా గుర్తించగా, దీనికి "ఒమిక్రాన్" అనే నామకరణం చేశారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. ఈ వైరస్ ఇప్పటికే పలుదేశాలకు పాకింది. ముఖ్యంగా, 32 రకాల మ్యుటేషన్‌తో ఈ వైరస్ హడలెత్తిస్తుంది. 
 
ఈ వైరస్ ప్రభావం, పనితీరుపై శాస్త్రవేత్తలు స్పందిస్తూ, ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ సోకి, తిరిగి కోలుకున్న రోగులకు కూడా మరోమారు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనాలు ఉండటం ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. 
 
కాగా, సౌతాఫ్రికాలోని ఓ హెచ్ఐవి రోగిలో ఈ వైరస్‌ను గుర్తించారు. అతనిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఆ తర్వాత బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో ఆఫ్రికా దేశాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దు.. శ్రీలీల

Naresh Agastya: సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లా : నరేష్ అగస్త్య

కేడి దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.. షాకైన టాలీవుడ్

సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్

Anaswara Rajan: టాలీవుడ్ లో కార్ వాన్స్, బడ్జెట్ స్పాన్ చూసి ఆచ్చర్య పోయా : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments