ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ : చైనాలో మళ్లీ కలకలం

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (06:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. తాజాగా ఈ వైరస్ ఐస్‌క్రీమ్‌లో కూడా కనిపించింది. దీంతో ఐస్క్రీమ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఇది కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసింది. దీంతో ఆ దేశంలో మరోమారు కలకలం చెలరేగింది. 
 
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా అప్రదిష్ట మూటగట్టుకున్న చైనాలో తాజాగా టియాన్జిన్ నగరంలో ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ క్రిములను గుర్తించారు. దాంతో ఆ బ్యాచ్‌కు చెందిన ఐస్‌క్రీమ్ బాక్సులన్నింటినీ కంపెనీ వెనక్కి తెప్పిస్తోంది. 
 
ఈ పరిణామంతో టియాన్జిన్లోని దఖియావోదావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ఈ పరిస్థితులు చక్కబడే వరకు కంపెనీ మూతవేశారు. దఖియావోదావో ఫుడ్ కంపెనీలో ఉద్యోగులు కూడా కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు దీనిపై ఆంక్షలు విధించాయి.
 
మరోవైపు, ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఐస్‌క్రీమ్ తిని కరోనా బారినపడినట్టు ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు రాలేదు. ఈ కంపెనీ తాజాగా 29 వేల ఐస్‌క్రీమ్ కార్టన్లను అమ్మకానికి సిద్ధం చేసింది. టియాన్జిన్‌లో విక్రయించిన 390 కార్టన్లను గుర్తించి వెనక్కి తీసుకున్నారు. 
 
కాగా, దఖియావోదావో ఫుడ్ కంపెనీ తమ ఐస్‌క్రీముల్లో ఉపయోగించేందుకు న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి పాల ఉత్పత్తులును దిగుమతి చేసుకుంటుంది. వీటి ద్వారా కరోనా వైరస్ క్రిములు ఐస్‌క్రీముల్లోకి చేరి ఉంటాయన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments