Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో తప్పని తలనొప్పి.. చేపల్లో కూడా కరోనా వుందట..

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (09:36 IST)
చైనాతో ప్రపంచ దేశాలకు తలనొప్పి తప్పట్లేదు. ఇప్పటికే చికెన్ తింటే కరోనా వస్తుందని హెచ్చరించిన చైనా.. ప్రస్తుతం చేపల్లో కరోనా ఉందని చెబుతోంది. అందుకే చైనాకు వస్తున్న దిగుమతులను చైనా ఆపేసింది. ఇందులో ఇండియా నుంచి వెళ్లే దిగుమతులు చైనా ఆపేసింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న చేపల్లో చైనా కరోనా వైరస్‌ను గుర్తించింది. 
 
భారత్‌లోను బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి ఈ చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. చైనా అక్కడ వీటిని పరీక్షించగా కరోనా వైరస్ ఉన్నట్లు తేలినట్లు ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. దీంతో ఆ కంపెనీ దిగుమతులను చైనా నిలిపివేసిందని తెలుస్తోంది. గట్టకట్టిన కటిల్‌ఫిష్ ప్యాకేజీలో మూడు శాంపిల్స్‌లో వైరస్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. అందుకే ఈ దిగుమతులపై వారం పాటు నిషేధం విధించినట్లు పత్రిక పేర్కొంది. 
 
అయితే చైనా ఇలా దిగుమతులను నిలిపివేయడం ఒక్క భారత కంపెనీలకు మాత్రమే కాకుండా ఇండోనేషియా, బ్రెజెల్, ఈక్వెడార్, రష్యా దేశాల నుంచి వస్తున్న ఆహార పదార్థాలను కూడా పరీక్షించింది. వీటిలో బ్రెజిల్‌, ఈక్వెడార్ దేశాల నుంచి వస్తున్న ఆహారపదార్థాల్లో కూడా వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించింది. అప్పుడు కూడా ఈ దేశాల నుంచి వస్తున్న దిగుమతులను ఆపేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments