Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాను కలవరపెడుతున్న డెల్టా.. మాస్కులు ధరించాలంటూ..

Webdunia
బుధవారం, 28 జులై 2021 (14:36 IST)
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా ఏ విధంగా తల్లడిల్లిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ వైరస్ మహమ్మారి నుంచి ఆ దేశం త్వరగానే కోలుకుంది. కొన్నినెల‌ల క్రితం క‌రోనా కేసులు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డం, పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుండ‌డంతో మాస్కులు పెట్టుకోవాల‌న్న నిబంధ‌న‌ను ఎత్తివేశారు. 
 
కానీ, గత కొన్ని రోజులుగా అమెరికాను క‌రోనా డెల్టా వేరియంట్ క‌ల‌వ‌రపెడుతోంది. దీంతో క‌రోనా తీవ్రత‌ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్ర‌జ‌లు మాస్కులు పెట్టుకోవాల్సిందేన‌ని అమెరికా ప్ర‌భుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది.
 
అలాగే, వ్యాక్సిన్ మీద భ‌యంతో చాలా మంది దాన్ని తీసుకునేందుకు ముందుకు రావ‌ట్లేదు. దీంతో వ్యాక్సినేష‌న్ ప‌ట్ల శ్ర‌ద్ధ చూపాల‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి పిలుపునిచ్చారు. 
 
టీకాలు ప్ర‌భావవంతంగానే ప‌నిచేస్తున్నాయ‌ని అమెరికా అంటువ్యాధుల‌ నిపుణులు డాక్టర్ ఫౌచీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు అధిక‌మ‌వుతున్నాయని, థర్డ్ వేవ్ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్ర‌జ‌లు ఖచ్చితంగా మాస్క్‌లు ధ‌రించాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments