Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 2021 ఫిబ్రవరి నాటికి 65 కోట్ల మందికి కరోనా!!!

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (08:42 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పీడ ఇప్పట్లో విరగడయ్యేలా కనిపించడం లేదు. వచ్చే 2021 ఫిబ్రవరి నాటికి దేశంలోని 130 కోట్ల మంది జనాభాలో యాభై శాతం మందికి అంటే 65 కోట్ల మందికి ఈ వైరస్ సోకుతుందట. ఈ విషయాన్ని కాన్పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ప్రొఫెసర్, కమిటీ సభ్యుడు మనీంద్ర అగర్వాల్ చెప్పుకొచ్చాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మా గణిత నమూనా అంచనా ప్రకారం ప్రస్తుతం జనాభాలో 30 శాతం మంది కరోనా సోకింది. ఫిబ్రవరి నాటికి ఇది 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది' అని, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిర్వహించిన సెరోలాజికల్ సర్వే ప్రకారం దేశ జనాభాలో 14 శాతం మందికి వైరస్‌ సోకినట్లు తేలిందన్నారు. 
 
గత నెల రోజుల్లో వైరస్‌ వ్యాప్తి బాగా పుంజుకోవడంతో దేశ జనాభాలో 30 శాతం మంది కరోనా బారినపడ్డారని చెప్పారు. అయితే జనాభా భారీ రిమాణం కారణంగా సెరోలాజికల్ సర్వే ద్వారా నమూనాలను సరిగా అంచనా వేయలేకపోయినట్లు అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.
 
మరోవైపు వరుస పండుగలు, శీతాకాలం నేపథ్యంలో మూస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించకపోతే ఒక్క నెలలోనే 26 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశమున్నదని కమిటీ తన నివేదికలో హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments