Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు సెల్ఫ్ ట్రీట్మెంట్... వైద్యుడు మృతి

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (19:07 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అదేసమయంలో ఈ వైరస్ బారినపడినవారికి సరైన మందు లేదు. అయితే వైద్యులు పర్యవేక్షణలో ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారు. అయితే, కొందరు వైద్యులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటివారి అస్సాంకు చెందిన ఉత్పలజిత్ బర్మన్ ఒకరు. ఈయన కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదికాస్త వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు.
 
కరోనా పేషెంట్లకు సేవలు అందించే వైద్యులు, నర్సులు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నా.. అంటువ్యాధి సోకుంతదనే అనుమానం వారితో పాటు.. వారి కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి అంటుకోకుండా ఉండేందుకు చాలా మంది వైద్యులు హైడ్రాక్సీక్లోరోకైన్‌ ఉపయోగిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. 
 
మలేరియాను నిరోధించడానికి ఉపయోగించే ఈ ఔషధం కోవిడ్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందనే ఉద్దేశంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌​ టాస్క్‌ ఫోర్స్‌ దీని వాడకానికి అనుమతినిచ్చినట్లు సమాచారం.​​​​ ఈ క్రమంలో అసోంలో హైడ్రాక్సీక్లోరోకైన్‌ తీసుకున్న ఓ డాక్టర్‌ మృతి చెందడం కలకలం రేపుతోంది.
 
ఉత్పలజిత్ బర్మన్ కొన్ని రోజుల క్రితం గుండె సంబంధిత వ్యాధితో ఆయన వేరొకరి ఆస్పత్రిలో చేరారు. ఇక కరోనా వ్యాపిస్తున్న తరుణంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఆయన హైడ్రాక్సిక్లోరోకైన్‌ తీసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం