Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తం

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (10:51 IST)
కరోనా వైరస్ కొత్త వేరియంట్ స్ట్రైయిన్‌పై భారత్ అప్రమత్తమైంది. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్తరకం వైరస్‌కు సంబంధించి చర్చించేందుకు సోమవారం ఉదయం ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. కోవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందాన్ని భేటీకి కేంద్రం పిలిచింది. స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై కేంద్రం చర్చించనుంది. 
 
ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓలోని భారత ప్రతినిధి రోడరికో హెచ్‌ ఓఫ్రిన్‌ హాజరు కానున్నారు. బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆదివారం లండన్‌లో ప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్‌ విధించింది. స్ట్రెయిన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. 
 
ఈ క్రమంలో ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయితే యూకే నుంచి విమానాల నిషేధంపై భారత్‌ ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments