Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకుంటే డ్రింక్స్ ఫ్రీ.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (15:51 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ నియంత్రణ కోసం కొన్ని రకాలైన టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాల పంపిణీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయేల్ దేశంలోని ఓ బార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఉచితంగా నాన్ ఆల్కాహాలిక్ డ్రింక్ ఇస్తామని తెలిపింది. 
 
ఇజ్రాయేల్ దేశంలో సుమారుగా కోటి మంది జనాభా ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు 43 శాతం మందికి టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌‌‌లోని ఓ బార్ పసందైన ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింక్స్ ఫ్రీ అంటూ ఊరిస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో ఇజ్రాయెల్‌లోని చాలా బార్లు, పబ్‌లు మూతపడ్డాయి.
 
అయితే స్థానిక మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకున్న జెనియా గాస్ట్రోపబ్ కస్టమర్లు కరోనా టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు పబ్‌లో ఉచితంగా డ్రింక్స్ తాగొచ్చు. అయితే ఆరోగ్యపరమైన కారణాల రీత్యా ఆల్కహాల్ లేని డ్రింక్స్ (నాన్ ఆల్కహాలిక్)ను అందించనుంది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments