Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona second wave: 730 మంది వైద్యులను మింగేసిన కరోనా

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (21:32 IST)
కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో 730 మంది వైద్యులు మరణించారని బీహార్‌లో గరిష్ట మరణాలు సంభవించాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) బుధవారం తెలిపింది.
బీహార్‌లో 115 మంది వైద్యుల మరణాలు నమోదయ్యాయి, ఢిల్లీలో 109 మంది మరణించారు, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది మరణించారు.
 
దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణ 37, కర్ణాటక 9, కేరళ 24, ఒడిశా 31 మరణాలు నమోదయ్యాయి. నేడు, భారతదేశం గత 24 గంటల్లో 62,224 తాజా COVID-19 కేసులను నమోదు చేయగా, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతానికి పడిపోయిందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoFHW) తెలిపింది.
వరుసగా తొమ్మిది రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. క్రియాశీల కేసులు 8,65,432కు తగ్గాయి. 70 రోజుల్లో తొలిసారిగా ఇవి 9 లక్షలకు తగ్గాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జాతీయ COVID-19 రికవరీ రేటు 95.80 శాతానికి మెరుగుపడింది. కొత్త కేసులతో దేశ సంఖ్య 2,96,33,105కు చేరుకుంది. COVID-19 మరణాల సంఖ్య గత 24 గంటల్లో 2,542 తాజా మరణాలతో 3,79,573కు చేరుకుంది.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments