Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మరణాల్లో 73 శాతం అనారోగ్యులే : లవ్ అగర్వాల్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (17:40 IST)
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. అయితే, దేశంలో ఇప్పటివరకు చనిపోయిన కరోనా రోగుల్లో 73 శాతం మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, దేశంలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. గత 24 గంటల్లో 3,708 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. 
 
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 48.07 శాతం ఉందని, కరోనా మరణాల్లో 73 శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. కరోనాపై పోరాటంలో టెలీమెడిసిన్‌ ఎంతో ఉపయోగకరమని, ప్రజలంతా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని లవ్‌ అగర్వాల్‌ సూచించారు. 
 
ఇకపోతే, దేశంలో కరోనా మరణాల సంఖ్య 2.82 శాతంగా ఉందని, ప్రపంచంలోనే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువని, ఇది ఊరట కలిగించే అంశమన్నారు. భారత్‌లో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులున్నాయని, కోలుకుంటున్నవారి సంఖ్య లక్షకు చేరువలో ఉందన్నారు. అలాగే, ప్రతి రోజూ దేశంలో రోజుకు లక్షా 20 వేల కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments