Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేంద్రంగా మారిన క్లస్టర్.. 66 మంది భారతీయులకు పాజిటివ్

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (15:41 IST)
శ్రీలంకకు కరోనా చుక్కలు చూపిస్తోంది. ఇంకా లంకలో నివసించే భారతీయులను కోవిడ్ నానా ఇబ్బందులు పెడుతోంది. తాజాగా శ్రీలంకలో భవన నిర్మాణరంగంలో పనిచేసే 66 మంది భారతీయ కార్మికులు కరోనా బారిన పడ్డారు. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15,722కు చేరితే.. వీటిలో ఒక్క ఈ క్లస్టర్ పరిధిలోనివే 9,120 కేసులు ఉండడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో కొలంబోలో శుక్రవారం కార్మికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మంది భారతీయులకుపాజిటివ్‌గా తేలిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నార్త్ కొలంబో ప్రాంతంలో నివాసముండే ఈ కార్మికులకు చేపల మార్కెట్ క్లస్టర్ ద్వారా వైరస్ సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని కొలంబో నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. రువాన్ విజేముని తెలిపారు. 
 
ప్రస్తుతం ఈ 66 మంది ధర్గా టౌన్‌లోని తాత్కాలిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, శ్రీలంకలో ఈ చేపల మార్కెట్ క్లస్టర్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిందని.. దేశంలో అత్యధిక కేసులు ఈ క్లస్టర్‌తోనే సంబంధం కలిగి ఉంటున్నాయని రువాన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments