Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎయిమ్స్‌లో 30 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్‌కు...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (11:17 IST)
ఢిల్లీ ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిపి 30 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట బ్రెయిన్‌ స్ట్రోక్‌ లక్షణాలతో 72 ఏళ్ల వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయనకు సీటీ, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు నిర్వహించి, న్యూరాలజీ వార్డులో ఇతర రోగులతో పాటు ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
ఉన్నట్టుండి ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఛాతీ ఎక్స్‌-రే తీసి, వెంటిలేటర్‌ అమర్చారు. ఆయన నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపగా ఆయనకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు, పరీక్షలు నిర్వహించిన టెక్నీషియన్లు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో హాట్‌ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను ఈనెల 30 వరకు పూర్తిగా దిగ్బంధించాలని ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. హోం డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ఆగ్రా, లక్నో, గౌతమ్‌ బుద్ధ నగర్‌, కాన్పూర్‌, వారాణసి, షామిల్‌, మీరట్‌, బరేలీ, బులంద్‌షహర్‌ తదితర జిల్లాల్లో కొవిడ్‌-19 బాధితులు ఎక్కువగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments