Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి సంతాప విందు ఫలితం .... 26 వేల మందికి హోం క్వారంటైన్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:47 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి మృతికి సంతాపంగా ఇచ్చిన విందుకు హాజరైన 26 వేల మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. నిజానికి ఈ సంతాప విందుకు 1200 మంది హాజరయ్యారు. కానీ, 26 వేల మందిని హోంక్వారంటైన్‌కు తరలించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురేనా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈయన తల్లి ఇటీవల చనిపోయింది. దీంతో మార్చి 17వ తేదీన దుబాయి నుంచి సొంతూరుకు వచ్చాడు. ఆ తర్వాత అంటే మార్చి 20వ తేదీన తమ సంప్రదాయం ప్రకారం తల్లి మృతికి సంతాపంగా విందు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు అందరూ కలిసి దాదాపు 1200 మంది వరకు హాజరయ్యారు. 
 
ఇంతవరకు బాగానేవుంది... మార్చి 27వ తేదీన విందు ఇచ్చిన వ్యక్తితో పాటు.. అతని భార్యలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు... అతనివద్ద వివరాలు సేకరించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
తాను దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పాడు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు ఈ నెల 2న తేలింది. విందులో పాల్గొన్న మరో 10 మందికి కూడా కరోనా వైరస్ సోకినట్టు మూడో తేదీన నిర్ధారణ అయింది. దీంతో విందుకు హాజరైన, వారితో సన్నిహితంగా మెలిగిన దాదాపు 26,000 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments