Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లల మామిడాడలో కరోనా పంజా... 125కి చేరిన కేసులు

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (09:29 IST)
గొల్లల మామిడాడలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో  గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా వైరస్‌ బారిన పడ్డారు.
 
అలాగే  పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లాలో కొత్తగా 64 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 589కి చేరింది. ఏలూరు సిటీ, రూరల్ పరిధిలో కొత్తగా 22 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ రెండు ప్రాంతాలలో పాజిటివ్ కేసులు 199కి చేరాయి. నరసాపురం, మొగల్తూరు తీరు పై ప్రాంతాన్ని కోవిడ్ కేసులు వణికిస్తున్నాయి. 
 
జిల్లా వ్యాప్తంగా కొత్తగా తొమ్మిది కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ సెంటర్‌ను వంద పడకలతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఏలూరు సీఆర్‌ఆర్ మహిళా కాలేజీలో వంద పడకలతో మరో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments