యాదగిరిగుట్ట ఠాణా పోలీసులపై కరోనా పంజా

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (12:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన ఆంక్షలను అమలు చేస్తుంది. అయినప్పటికీ అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. 
 
తాజాగా భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పోలీస్ ఠాణాపై కరోనా పంజా విసిరింది. ఈ స్టేషన్‌‌లో పనిచేసే పోలీసుల్లో ఏకంగా 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 
 
దేశ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండగంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments