పాలకూర, క్యాప్సికమ్ ఆమ్లెట్ ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:03 IST)
పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

అలాగే క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి, కెలు ఉన్నాయి. ఇంకా విటమిన్ బి6 గుండె పోటును నియంత్రిస్తుంది. కెలోరీలను బర్న్ చేసే క్యాప్సికమ్ కంటికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి పాలకూర, క్యాప్సికమ్ కాంబినేషన్‌లో ఆమ్లెట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా.
 
కావలసిన పదార్థాలు : 
పాలకూర తరుగు - ఒక కప్పు
క్యాప్సికమ్ తరుగు - ఒక కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
గరం మసాలా - అర టీ స్పూన్ 
కోడిగుడ్లు - మూడు  
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
నూనె, ఉప్పు - తగినంత    
 
తయారీ విధానం :
ఒక బౌల్‌లో పాలకూర, క్యాప్సికమ్, ఉల్లి, మిర్చి ముక్కలను కలిపి అందులో కోడిగుడ్డు, గరం మసాలా, అల్లం పేస్ట్ చేర్చి బాగా గిలకొట్టాలి. స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక కోడిగుడ్డును మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా పోసి.. ఇరువైపులా దోరగా వేపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇక చీజ్ తురుమును చేర్చి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

Show comments