కోడిగుడ్లను ఎక్కువ సేపు ఉడికించకండి.. 8-10 నిమిషాలు ఉడికితే చాలు

గుడ్డును చాలాసేపు ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికిపోతే అందులోని ప్రోటీను స్వభావం మారిపోయి, అది సరిగా జీర్ణంకాదు. గుడ్డును నీళ్లు మసిలే వేడిలో 8-10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (10:22 IST)
గుడ్డును చాలాసేపు ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికిపోతే అందులోని ప్రోటీను స్వభావం మారిపోయి, అది సరిగా జీర్ణంకాదు. గుడ్డును నీళ్లు మసిలే వేడిలో 8-10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉడికించిన గుడ్డును అలాగే తినెయ్యొచ్చు. కొద్దిగా ఉప్పు, కారం, మిరియాలపొడి వంటివి చల్లుకునీ తినొచ్చు. లేదంటే కొద్దిగా నూనెవేసి దోరగా వేయించుకుని తినొచ్చు.

ముక్కలు చేసి, బ్రెడ్‌ మధ్యలో పెట్టుకుని తినొచ్చు. ఉడికించిన గుడ్డును బాగా మెదిపి, అందులో ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా బట్టర్‌ కలుపుకొని బ్రెడ్‌ స్లైసుల మధ్య పెట్టుకుని తినొచ్చు. ఉడికించిన గుడ్డును మసాలా కూరలు, బిర్యానీలు, టమాటా గ్రేవీ వంటివాటిలోనూ వేసుకుని తినొచ్చు. వెజిటబుల్‌ సాలడ్స్‌తో పాటుగా కూడా ఉడికించిన గుడ్డు ముక్కలు తినొచ్చు.
 
ఆమ్లెట్‌ వేసుకుందామనుకుంటే నూనె ఎక్కువగా లేకుండా, నాన్‌స్టిక్‌ పెనం మీద లేదా స్టీల్‌ పాత్రలో వేసుకోవటం మంచిది. ఆమ్లెట్‌ను బ్రెడ్‌ మధ్య పెట్టుకుని తినొచ్చు. గుడ్డు వండేటప్పుడు నూనె, ఉప్పు వంటివి ఎక్కువెక్కువ వెయ్యాల్సిన పని లేదు. దానిలోనే సహజంగా సోడియం, పొటాషియం వంటి లవణాలు తగుమాత్రంగా ఉంటాయి. కాబట్టి వాటిలో పెద్దగా కలపాల్సిన పని ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments