Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జను తగ్గించాలంటే.. ఈ జ్యూస్‌ను తాగండి..

ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (14:25 IST)
కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడం వంటి కారణాల చేత.. మూడు పదుల్లోనే ఆడామగా తేడా లేకుండా బొజ్జ పెరిగిపోతుంది. అలా మీకు కూడా బొజ్జ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను తాగండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. 
 
కడుపులో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత సులభం కాదు. పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతే.. దాన్ని కరిగించేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఇంకా ఈ జ్యూస్‌ను పరగడుపున తాగడం ద్వారా పొట్టను  తగ్గించుకోవచ్చు. 
 
పొట్టను తగ్గించే జ్యూస్ ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు : 
కీరదోస -1 
నిమ్మ కాయ - 1  
పుదీనా ఆకులు - అర కప్పు 
అల్లం తురుము - రెండు స్పూన్లు 
నీరు  -  తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూట ఈరసాన్ని తాగితే మూడు నెలల్లోపు పొట్ట తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే విధంగా ఓ గ్లాసుడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం, తేనె, రెండు వెల్లుల్లి రేకుల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments