ఫ్రిడ్జ్‌లో ఈ పదార్థాలు నిల్వ వుంచకూడదు, ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (23:23 IST)
చాలామంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెడితో పాడయిపోతాయి. ఆ పదార్థాలలో కొన్నింటి గురించి తెలుసుకుందాము.
 
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచడం వల్ల దాని లక్షణాలపై చెడు ప్రభావం పడుతుంది. 
 
ఫ్రిడ్జ్‌లో దోసకాయలను నిల్వ చేయడం వల్ల అవి నీరు, గుంటలుగా మారుతాయి. అందువల్ల వాటిని ప్లాస్టిక్‌లో చుట్టి పెట్టడం ఉత్తమం.
 
ఉల్లిపాయలు ఫ్రిడ్జ్‌లో పెడితే మెత్తగా, బూజు పట్టినట్లు మారుతాయి. కనుక ఉల్లిని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
 
ఉల్లిపాయల మాదిరిగా వెల్లుల్లిని కూడా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచడం మంచిది. శీతలీకరణ వల్ల అది రబ్బరులా మారుతుంది.
 
బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో వుంచితే నుండి అదనపు తేమతో తీపిగా మారుతాయి. కొన్నిసార్లు వాటికి మొలక కూడా వస్తుంది. అవి హానికరం.
 
టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వలన అవి సరైన రుచి, రసాన్ని కలిగి ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే వీటిని కోల్పోతాయి.
 
అరటిపండ్లు పండడానికి వెచ్చని ఉష్ణోగ్రతలు అవసరం. ఫ్రిడ్జ్‌లో పెడితే నల్లగా మారిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments