మునగాకు సూప్ తాగితే మగవారిలో...?

మునగాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా త్రాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ నొప్పులు తొలగిపోతాయి. ర

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (13:05 IST)
మునగాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా త్రాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ నొప్పులు తొలగిపోతాయి. రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మునగాకును పాలలో మరిగించి ఆ పాలను త్రాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. అలాంటి మునగాకుతో సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు : 
మునగాకు - 2 కప్పులు 
క్యారెట్ తురుము - 1/2 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు 
ఉల్లి తరుగు - 1/2 కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్  
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
ఉప్పు - తగినంత  
మిరియాల పొడి - 1 స్పూన్ 
జీలకర్ర - 1 స్పూన్ 
నూనె- 2 స్పూన్స్ 
ఇంగవ పొడి - చిటికెడు 
 
తయారీ విధానం :
ముందుగా ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వేసి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి కాసేపు ఉడికించాలి. మరో బాణలితో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్రను, మునగాకును వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టుకుని మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై బౌల్‌లోకి తీసుకుని అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకుంటే మునగాకు సూప్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Modi Is My Friend: నరేంద్ర మోదీ నా స్నేహితుడు.. త్వరలోనే మంచి డీల్: డొనాల్డ్ ట్రంప్

హమ్మయ్య.. డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు... ఆ సుంకాలు రద్దు

Liquor Scam: ఈడీ ఎదుట హాజరుకానున్న విజయసాయి రెడ్డి

Nandyal-నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుక్కకు తులాభారం, ప్లీజ్ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి: నటి టీనా శ్రావ్య (video)

జై హో పాటపై ఆర్జీవీ కామెంట్లు.. ఏఆర్ రెహ్మాన్‌ వ్యాఖ్యలపై వర్మ ఎండ్ కార్డ్

Chiranjeevi: మళ్ళీ మన శంకర వరప్రసాద్ టికెట్ ధరలు పెరగనున్నాయా?

Naveen Chandra: సైకలాజికల్ హారర్ గా నవీన్ చంద్ర మూవీ హనీ తెరకెక్కుతోంది

Rajiv Kanakala: ఏ స్వీట్ రైవల్రీ తో ఆత్రేయపురం బ్రదర్స్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments