అన్నం వండేటప్పుడు ముద్దగా అవుతుందా..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (16:58 IST)
వంట చేసేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాలు తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే.. మీరు ఎంత రుచిగా వంటలు చేసినా ఈ చిట్కాలు తెలియకపోతే ఏం చేయలేరు. కనుక ఈ కింద చెప్పబడిన చిట్కాలు పాటించి చూడండి మీకే తెలుస్తుంది.
 
1. అన్నం వండేటప్పుడు ముద్దగా అవుతుందా.. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఉడికించేటప్పుడు అందులో స్పూన్ వంట నూనె వేస్తే పొడిపొడిగా ఉంటుంది. ఇక వడలు, గారెలు చేసేటప్పుడు నూనె చింది మీద పడుతుంటే.. నూనెలో రెండు స్పూన్ల నెయ్యి కలిపితే సరిపోతుంది.
 
2. దోశలు మెత్తగా రావడం లేదా.. అయితే బియ్యం లేదా రవ్వను కప్పు తీసుకుని జావకాచి చల్లార్చి దోశ పిండిలో కలుపుకోవచ్చును. స్వీట్స్ చేసేటప్పుడు చక్కెరకు బదులుగా దానిని పొడిలా చేసుకుని వేస్తే అవి ఇంకా రుచిగా ఉంటాయి. 
 
3. పెనం, మూకుడు వంటి వాటికి పదార్థాల మరకలు పోకుంటే.. గిన్నెలు తోముకునే లిక్విడ్‌కు కొద్దిగా వంటసోడా, కొన్ని నీళ్ళు కలిపి రుద్దితే సరిపోతుంది. ఇక పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ పోలేదంటే.. పెనాన్ని వేడినీళ్ళల్లో 2 నుండి 3 గంటల పాటు ఉంచి.. తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే పోతుంది. 
 
4. చేపముక్కల్ని నిల్వచేయాలా.. అయితే వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచితే ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు. ఇంకా చెప్పాలంటే.. అరటి, పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయి. రుచిగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)

నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?

ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

తర్వాతి కథనం
Show comments