ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:53 IST)
తేనె నిల్వ ఉండేందుకు... శుభ్రమైన సీసాలో పోసి రెండు లవంగాలను అందులో వేసి ఉంచాలి. బెల్లాన్ని నీటిలో కరిగించి.. ఆపై వడగట్టి పాకం పడితే ఇసుక రాకుండా ఉంటుంది. చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే.. పిండిలో నూనె, పాలు, బియ్యం పిండి వేసి ఐస్ నీళ్లతో కలపాలి. 
 
ఆమ్లేట్ పాన్‌కి అంటుకోకుండా రావాలంటే.. ఆమ్లేట్ వేసే ముందు పాన్‌పై కొద్దిగా ఉప్పు చల్లి చూడండి. మరలు బిగుసుకుపోయిన జాడీ మూతలను తేలికగా తీయాలంటే.. కొద్దిగా నూనెలో ఉప్పు కలిపి జాడీ మూతలకు పట్టించి కాసేపటి తరువాత తీస్తే తేలికగా తిరుగుతూ వచ్చేస్తాయి. ఇంట్లో ఫ్రిజ్ లేనప్పుడు పచ్చిమిరపకాయలను తడిలేకుండా తుడిచేసి ఓ స్పూన్ పసుపుపొడిని వాటికి పట్టించి గాజు డబ్బాలో వేసి గట్టిగా మూత బిగించి ఉంచితే వారం రోజులపాటు చెడిపోకుండా ఉంటాయి. 
 
నిమ్మరసం ఎక్కువగా రావాలంటే నిమ్మకాయలను 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంటే రసం తీయడానికి 10 ముందు వాటిని బయటపెట్టాలి. వంట పాత్రలకు అంటుకున్న జిడ్డు పోవాలంటే నిమ్మచెక్కతో పాత్రలను బాగా రుద్దిన తరువాత నీటితో కడిగి, మెత్తటి వస్త్రంతో పాత్రలను తుడవాలి. పకోడీలను కలిపిన పిండిని పావుగంట పాటు ఊరనిచ్చి ఆ తరువాత కొన్ని వెల్లుల్లిపాయలను నూరి కలిపితే పకోడీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్ట్రేలియా తరహాలో 16 యేళ్ళలోపు చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్...

పిజ్జా, బర్గర్ తిని ఇంటర్ విద్యార్థిని మృతి, ప్రేవుల్లో ఇరుక్కుపోయి...

బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు - హిందువులను చంపేస్తున్నారు...

15 ఏళ్ల క్రిందటి పవన్ సార్ బైక్, ఎలా వుందో చూడండి: వ్లాగర్ స్వాతి రోజా

ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ రూ.2 వేల కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

మహిళకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉంది.. : హెబ్బా పటేల్

4 చోట్ల బిర్యానీలు తింటే ఏది రుచైనదో తెలిసినట్లే నలుగురితో డేట్ చేస్తేనే ఎవరు మంచో తెలుస్తుంది: మంచు లక్ష్మి

దండోరాను ఆదరించండి.. లేదంటే నింద మోయాల్సి వస్తుంది? హీరో శివాజీ

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

తర్వాతి కథనం
Show comments