Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే?

దోసెలు, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలు పోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు వెయ్యాలి. అప్పుడే ఆ వంటలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఎక్కువ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే వెల్లుల్లిపాయ ముక్

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (12:24 IST)
దోసెలు, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలు పోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు వెయ్యాలి. అప్పుడే ఆ వంటలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఎక్కువ వెల్లుల్లిపాయలు పొట్టు తీయాలంటే వెల్లుల్లిపాయ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టాలి. తర్వాత పొడిబట్టతో తుడిచేస్తే పొట్టు తీయడం తేలికవుతుంది.
 
పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది. అలాగే కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం, వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది. పాపడ్‌లు, వడియాలు మొదలైనవి వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. ఇక వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.  
 
బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. గోధుమరవ్వ, మైదా పిండి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా రోజులు చెడిపోకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. 10. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments