వంటింటి చిట్కాలు : కాకరకాయ కూర వండేటప్పుడు?

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (16:48 IST)
* ఊరగాయ పాతబడి ఎండిపోతే అరస్పూను చెరుకురసం కలిపి చూడండి. 
 
* కేక్ తయారు చేసే సమయంలో పిండికి చిటికెడు సాల్ట్ కలిపితే కేక్ చాలా రుచిగా ఉంటుంది. 
 
* కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయండి. చేదు తగ్గడమే కాదు, కూరకు కొత్త రుచి వస్తుంది. 
 
* కాఫీ మరీ చేదుగా అనిపిస్తే కాస్త ఉప్పు కలపండి, తాగడానికి రుచిగా ఉంటుంది. 
 
* క్యారెట్‌తో ఏ కూర చేసినా, అది ఉడికే సమయంలో కాస్తంత పంచదార వేయండి. ఇదే పద్దతిని గ్రీన్ పీస్‌తో చేసే కూరలకు పాటిస్తే రుచిగా ఉంటాయి. 
 
* క్యారెట్ హల్వా తయారయ్యాక దానికి కొద్దిగా బియ్యపు పిండి కలపండి. కేరెట్ హల్వా మంచి రుచిగా ఉంటుంది. 
 
* కుక్కర్‌‌లో పప్పు ఉడికించినప్పుడు ఒక్కోసారి పప్పులో నీరు ఎక్కువైపోతుంది. ఆ వేడి వేడి పప్పుతేరును చపాతి పిండిలో పోసి నానబెడితే పప్పులో ఉన్న పోషకవిలువలు వృధాకావు, చపాతీలు మృదువుగా వస్తాయి. 
 
* కూరగాయలు ఉడికించేటప్పుడు కొంచెం నిమ్మరసం చల్లితే రంగు మారకుండా ఉంటాయి. సూపుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేస్తే మంచి రుచి వస్తుంది. 
 
* కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే అధిక పసుపును అది పీల్చేసుకుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

Show comments